సాధారణంగా బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే మినిమమ్ బ్యాలన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కనీస బ్యాలన్స్ లేకపోతే బ్యాంకు ఛార్జీలు పడతాయి. అయితే ఇప్పుడు రూల్స్ మారాయి. మీరు బ్యాంకు అకౌంటు క్లోజ్ చేసినా బ్యాంకులు ఛార్జీలు విధించనున్నాయి. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం కొంత కాల వ్యవధిలో బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేస్తే ఛార్జీలు పడతాయి. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 14 రోజుల లోపు ఖాతాను క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు. ఆ తర్వాత నుంచి సంవత్సరం లోపు ఎప్పుడు ఖాతాను క్లోజ్ చేసినా ఛార్జీలు కట్టాల్సిందే. అదే, ఖాతా తెరిచి సంవత్సరం దాటితే ఎలాంటి ఛార్జీలు ఉండవు.
బ్యాంకులను బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు ఛార్జీలు పడతాయి. బ్యాంకు ఖాతా ఓపెనింగ్ కిట్, చెక్‌బుక్, డెబిట్ కార్డు.. తదితర సదుపాయాలు కల్పించినందుకు గానూ ఈ ఛార్జీలను బ్యాంకులను వసూలు చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఆర్బీఐ ఈ ఛార్జీల వసూలుపై ఎలాంటి గైడ్‌లైన్స్ విధించలేదు. ఛార్జీల వసూలు నిర్ణయాన్ని బ్యాంకులకే వదిలేసింది.
ఉదాహరణకు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అకౌంట్ క్లోజ్ చేసుకోవాలని భావిస్తున్నారా? బ్యాంక్ ఖాతా ప్రారంభించిన ఏడాది తర్వాత దాన్ని క్లోజ్ చేసుకుంటే ఎలాంటి చార్జీలు ఉండవు. అయితే ఇదివరకు ఏడాది తర్వాత కూడా అకౌంట్ క్లోజ్ చేసినా రూ.500 పెనాల్టీ పడేది. దీనికి జీఎస్టీ అదనం. 14 రోజులలోపు ఖాతా క్లోజ్ చేసుకున్న ఎలాంటి చార్జాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక 14 రోజుల తర్వాత ఏడాదిలోపు అకౌంట్ క్లోజ్ చేస్తే బ్యాంకులు రూ.500 నుంచి రూ.1,000 మధ్యలో చార్జీలు వసూలు చేస్తున్నాయి.
బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ చార్జీలకు సంబంధించి ఆర్బీఐ వద్ద నిర్దిష్టమైన నిబంధనలు అంటూ ఏమీలేవు. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయడానికి ముందుగానే అందులోని డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోండి. అలాగే లోన్లకు, ఇతర ఇన్వెస్ట్మెంట్లకు అకౌంట్‌ను లింక్ చేసి ఉంటే డీలింక్ చేసుకోండి. బ్యాంకుకు వెళ్లి అకౌంట్ క్లోజర్ ఫామ్‌ను ఫిల్ చేసి ఇవ్వాలి. ఇందులో వేరొక బ్యాంక్ అకౌంట్ నెంబర్ వివరాలు కూడా అందిచాల్సి ఉంటుంది. క్లోజ్ చేయబోయే అకౌంట్లోని డబ్బుల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే డెబిట్ కార్డు, చెక్ బుక్ వంటివి కూడా తిరిగిచ్చేయాల్సి ఉంటుంది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ à°¬à±à°¯à°¾à°‚కౠఅకౌంటౠమినిమమౠబà±à°¯à°¾à°²à±†à°¨à±à°¸à± à°¬à±à°¯à°¾à°‚కౠఅకౌంటà±â€Œ à°•à±à°²à±‹à°œà±